సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, చేనేత పవర్ రూం కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులను బాగు చేస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. విద్య పై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యేకంగా అభ