తక్షణమే రైతుల్ని ఆదుకో పోతే కూటమి ప్రభుత్వం కూలిపోతుందని,ఎన్ని అంక్షలు విధించిన తాము రైతుల పక్షాన నిరసన తెలియ జెసేందుకు గురజాల ఆర్డీఓ కార్యాలయంకు చేరుకున్నామన్నామని వైసిపీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు గౌతమ్ రెడ్డి అన్నారు.మంగళవారం మధ్యాహ్నం గురజాల, మాచర్ల మాజీ యమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిలను ఈ ప్రాంతానికి రాకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ నియంత్రత్వ దొరణకు అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు.రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకోక ముందే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.