పల్నాడు జిల్లా,పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం వైసీపీ సోషల్ మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ షర్మిల, అమరావతి మహిళలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలపై అసభ్యకర ట్రోలింగ్ చేశారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా తమ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, అవమానాలను అవకాశాలుగా మార్చుకుంటామని యరపతినేని పేర్కొన్నారు.