రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆదివారం రాత్రి నుండి నిద్ర మానేసి సోమవారం తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. పొలాల్లో పంటలు వాడిపోతున్నాయి యూరియా ఇప్పించండి అంటూ బాధతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాల కాలంలో యూరియా కోసం ఎప్పుడు ఇబ్బంది పడలేదని, ఇప్పుడు మాత్రం యూరియా కోసం అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం ఎలా ఉందో ఒకసారి మీరే వినండి..