సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు సీపీఐ అగ్ర నాయకులు, మాజీ పార్లమెంటేరియన్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి, వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ కేంద్రంలో ఆదివారం సి ప్రభాకర్ భవన్లో సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం నేతలు మాట్లాడుతూ, సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు నడిచి, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ లలో కీలక పదవులు నిర్వహించి ఎన్నో పోరాటాలు నిర్వహించారని కొనియాడారు.