అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో తన భూమి ఆక్రమణకు గురైందని, తన భూమిని తనకిప్పించాలని కోరుతూ కిండంగి గ్రామానికి చెందిన తలమారి ముత్యాలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ గతంలో తన 74 సెంట్లు భూమిలో చిన్న స్థలంలో ఉండడానికి గిరిజనేతరుడు అయిన త్రినాద్ అనే వ్యక్తికి అవకాశం ఇస్తే 28 సెంట్లు భూమి వరకు ఆక్రమించి ఇప్పుడు అతనిని అడిగితే ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అనే సమాధానం చెబుతున్నారని, తనకు చెందాల్సిన భూమి తనకి ఇప్పించాల్సిందిగా ఆమె మీడియా ముఖంగా కోరారు.