యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని శివారెడ్డి గూడెం గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమిని కాపాడాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు ఆదివారం అన్నారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కళ్లెం పెద్దిరెడ్డి అనే వ్యక్తి సుమారు 5 గుంటల భూమిని గ్రామపంచాయతీకి దానంగా ఇచ్చారని ఆ భూమిలో నీళ్లు ట్యాంకు మరుగుదొడ్లను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించాలని తర్వాత ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలని గ్రామపంచాయతీ తీర్మానం చేసిందన్నారు. ఈ భూమిని కబ్జా చేశారని తెలిపారు.