జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జెడ్పి చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ సంబంధిత పనులు ఊపందుకుంటున్నందున రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఆమె అధ్యక్షతన పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ప్రకాశం జిల్లా డీఆర్వో చిన ఓబులేసు, జడ్పీ సీఈవో చిరంజీవి, బాపట్ల జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర గౌడ్, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు