కాగజ్ నగర్ మండలం ఈజ్ గం శివ మల్లన్న స్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మూసివేశారు. రాత్రి 9:00 నుండి చంద్రగ్రహణం ఉన్నందున ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. సోమవారం ఉదయం 5 గంటల నుండి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామివారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు,