గుంటూరు బ్రాడిపేట 6/12 లైన్ లోని ఓ అపార్ట్మెంట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం కరెంటు షాక్ తో (43) సంవత్సరాల నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు నాగరాజును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగరాజు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.