శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జంక్షన్ సమీప జాతీయ రహదారి పై బుధవారం అర్ధరాత్రి దాటిన వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు స్థానికంగా ఉన్న దాబా యజమాని మహమ్మద్ హయాబ్, స్థానికం సర్పంచ్ తండ్రి దండాసి గా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.