నంద్యాల జిల్లా బేతంచర్లలో మతసామరస్య చైతన్య వేదిక అధ్యక్షుడు నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నామని ఆయన తెలిపారు. మండల టీడీపీ కన్వీనర్ ఎల్ల నాగయ్య, పారిశ్రామికవేత్తలు మారుతి శర్మ, సత్తార్ పాల్గొన్నారు. యువకులు అధిక సంఖ్యలో రక్తదానం చేశారు.