Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 8, 2025
అధికంగా యూరియాను పంటలకు వాడవద్దని వ్యవసాయ అధికారిని శైలజ కుమారి తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలంలోని లింగంగుంట, బెడుసుపల్లి గ్రామాల్లో యూరియా వాడకం, వాటి వల్ల కలిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.