పిజిఆర్ఎస్ కార్యక్రమంలో సోమవారం ఆదిత్య నగర్ వాసులు ఇచ్చిన పిర్యాదుపై జోన్2 కమిషనర్ కే కనకమహాలక్ష్మి స్పందించారు. 7వవార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, వెంకటరావు ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో మంగళవారం జోన్2 కమీషనర్ కే కనకమహాలక్ష్మి ఆదిత్యనగర్ లో పరిశీలన చేసారు. రోడ్డుకు అడ్డంగా అక్రమoగా నిర్మించిన గోడ్డను వెంటనే తొలిగించే చర్యలను తీసుకోవాల్సిందిగా టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ ఎస్ నాయుడు, సెక్రటరీ నాగోతి సూర్య ప్రకాష్ రావు, మరియు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిల్లా వెంకట్ రావు పాల్గొన్నారు.