కోసిగి : మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం లో కార్యాలయ సిబ్బంది మరియు వీఆర్వోలతో, విలేజ్ సర్వేయర్ లతో గురువారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా పనితీరు మెరుగు పరుచుకొని రీ సర్వే మరియు పిజిఆర్ఎస్ సమస్యలను పరిష్కారించాలి అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో తహసీల్దారు వేణు గోపాల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.