కర్నూలు జిల్లాలో జరిగిన అండర్ -14 హ్యాండ్ బాల్ పోటీలలో మద్దికేర శ్రీ విద్యా సాయి విద్యాసంస్థలకు చెందిన సురేష్, వర్షిత అనే ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. హ్యాండ్ బాల్ బోర్డు సెక్రటరీ రామాంజినేయులు సువర్ణ ఈ విషయాన్ని సోమవారం తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను కరస్పాండెంట్ వెంకట మాధవ్, ప్రిన్సిపల్ సునీత, పీఈటీ ఇస్మాయిల్ అభినందించారు.