కోడుమూరు పట్టణంలో శుక్రవారం రాత్రి వినాయక చవితి వేడుకల సందర్భంగా శాంతి కమిటీతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ తబ్రేజ్ మాట్లాడారు. ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రాత్రిపూట మండపాల వద్ద నిర్వాహకులు ఉండాలని కోరారు. డీజేలకు అనుమతి లేదన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు ఎర్రిస్వామి, మణికంఠ పాల్గొన్నారు.