శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నదితో పాటు పరీవాహక ప్రాంతాలు గురువారం మధ్యాహ్నం చెత్తాచెదారంతో దర్శనమిచ్చాయి. చెత్తాచెదారం వేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు తెలిపారు. చిత్రావతి నది పరీవాహక ప్రాంతాల్లో చెత్తాచెదారం వేయకూడదని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అనేకమార్లు సత్యసాయి భక్తులు చిత్రావతి నది సుందరీకరణలో భాగంగా శుభ్రం చేశారని, అయినా మళ్లీ వేస్తున్నారని వాపోయారు.