ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం తో పాటు జిల్లా వ్యాప్తంగా శనివారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించినట్లు ఒంగోలు డి.ఎస్.పి శ్రీనివాసరావు తెలిపారు. టంగుటూరు, సింగరాయకొండ, కొండపి ప్రాంతాలలో కూడా పోలీసులు వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాహనదారులకు జరిమానా విధించారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని పోలీసులు ఆదేశించారు.