యాదాద్రి భువనగిరి జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు పేద ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా శనివారం రాజాపేట మండలం సోమరంలో సుశీలమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేపట్టారు. గ్రామంలో ఇదే మొదటి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కావడంతో ఎమ్మెల్యే సుశీలమ్మ కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు ఒక మేకను బహుమతిగా అందజేశారు. అర్హులైన పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు.