ఈరోజు కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు NS. బోసురాజు గారు వారి సతీమణి గారితో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా లోని శ్రీ శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవారి నీ దర్శించుకోవడం జరిగింది.వారికి స్వాగతం పలికిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ ,మహాలక్ష్మీ దంపతులు గారు,అనంతరం వారిరువురు కలిసి శ్రీ. జోగులాంబ అమ్మవారి దేవాలయం ప్రత్యేక పూజలు మరియు హోమన్నీ నిర్వహించడం జరిగింది.మంత్రి గారికి మరియు సంపత్ కుమార్ గారికి దేవాలయ అర్చకులు పూర్ణ కుంబంతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించడం జరిగింది.