తవణంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంస్కృతికల సమస్త ఆధ్వర్యంలో జానపద దినోత్సవం సందర్భంగా మనసంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో జానపద పాటలపై అవగాహన కార్మాట్లాడుతూగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప, ఎంఈఓ హేమలత మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు జానపద కళలపై అభిరుచి పెంపొందించుకోవాలి. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో జానపద కళలను విస్తరించేందుకు కృషి చేస్తున్నాం అని అన్నారు. జానపద పాటలు, కళలు ఒక జాతి నిర్మాణానికి అవసరమైన విలువలను అందిస్తాయి. విద్యార్థులు ఇలాంటి సంస్కృతిని తెలుసుకొని కాపాడుకోవాలి అన్నారు.