గత వైసిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతి పొందిన 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తాం అనడం దుర్మార్గం అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని కొత్త పేటలో గల భగత్ సింగ్ విగ్రహం వద్ద మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీకి విరుద్ధంగా పరిపాలన సాగిస్తుందని నిరసిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్న రీతిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో బందెల నాసర్ జీ మాట్లాడారు.