ఓర్వకల్లు మండలం కొంతలపాడు గ్రామంలో వెలసిన అంబా సహిత శ్రీ యాగంటయ్య స్వామి మఠంలో స్వామి వారి 320 వ ఆరాధన మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు చైర్మన్ పార్వతమ్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, పూజారి జలంధరాచారి, వారి వంశస్థులు పాల్గొన్నారు.