15 నెలలు ఆలస్యంగా అయినా సరే కూటమి ప్రభుత్వం తొలి సంతకమైన 16,347 టీచర్ పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీని అమలు చేయడం హర్షనీయం అని రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి అన్నారు. అదే సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో మిగిలిపోయిన హామీల మాటేమిటి ? రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతినిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని కూటమి హామీ ఇవ్వడం జరిగింది .ఇప్పటికీ 14 నెలలు దాటింది .కానీ ఇంతవరకు మూడు రూపాయలు ఇవ్వలేదని చెప్పారు.