మామిడికుదురు మండలం, నగరం లో ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మిలాదీ ఉన్ నబీ వేడుకలు నిర్వహించారు. సున్ని జామియా మసీదు లో మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మత ప్రబోధకులు తారీకు అన్వర్ రిజ్వి ప్రాసస్యాన్ని భక్తులకు వివరించారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని యువకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు