కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సోన్ నిర్మల్ రూరల్ తహసిల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకులు సోమవారం వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 21 నెలలు అవుతున్న ఇప్పటి వరకు ఆసరా పెంచన్ రూ. 4 వేలు వికలాంగులకు రూ. 6 వేలు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు చేయలేదని మండిపడ్డారు. వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఆయా మండలాల అధ్యక్షులు మార గంగారెడ్డి, వెంకట్ రెడ్డి, మండల ప్రదాన కార్యదర్శులు మామిడాల సంతోష్, సుంచు సవీన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు నరేశ్,