తెలంగాణ సరిహద్దులు ఉన్న ఎగువ మహారాష్ట్ర, ఇక్కడి ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. శనివారం ఉదయం 2200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, రాగా 2200 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక గేటు ఎత్తి 2200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు కాగా, ప్రస్తుతం 358.6 మీటర్ల వరకు నీరుంది. దిగవన ఉన్న గ్రామాలు పశువుల కాపరులు మత్స్యకారులు గొర్రెల కాపరులు నది పర్వత ప్రాంతం వద్ద వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు లో తట్టు ప్రాంత ప్రజల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు