రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రాజు అన్నారు. కామారెడ్డిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, BJP, BRSలు కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే రైతే రాజు అంటూ మాట్లాడుతారని గెలిచిన తరువాత వారిని కష్టాలు పెడతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అరవింద్, రాజలింగం, శివ పాల్గొన్నారు.