గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు ప్రవహిస్తున్నది. దీంతో గురువారం ఉదయం నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. గుత్తి వైపు నుంచి చెట్నేపల్లి, యంగన్నపల్లి, బేతాపల్లి, ఊటకల్లు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో పై భాగంలో ఉన్న పెద్ద వంక నుంచి వరద నీరు భారీగా బ్రిడ్జి కిందకు చేరుకుంది. వరద నీరు భారీగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.