నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం సాయంత్రం 5 గంటలకు పబ్లిక్ హెల్త్ సిబ్బందితో వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. కమర్షియల్ కు సంబంధించి ఇప్పటి వరకు గుర్తించని ట్రేడ్ లైసెన్సులు గుర్తించి వారి చేత డబ్బులు జమ చేయించి వాటిని ఆన్లైన్లో పొందుపరచవలసిందిగా ఆదేశించారు. వారి పరిధిలోని ట్రేడ్ లైసెన్సులకు సంబంధించిన వివరములను ఫార్మేట్ రూపంలో పొందుపరిచి వలసినదిగా ఆదేశించారు. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశించారు.