యూరియా కొరత పై పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శుక్రవారం పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన బహిరంగ మార్కెట్ లో యూరియా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాపారస్తులు ఎక్కువ ధరకు యూరియా అమ్ముతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నదని అన్నారు. ఈ విషయమై పీలేరు నియోజకవర్గంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని అన్నారు.