చవితి శాంతియుతంగా జరగాలి: DSP రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక విగ్రహాల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను శాంతియుతంగా, అందరి సహకారంతో చేసుకోవాలని సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనం సందర్భంగా నిబంధనలు పాటించాలని, ఎలాంటి గందరగోళాలకు తావు ఇవ్వకూడదని హెచ్చరించారు.