శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం నగరంలోని దూది వారి కోవెల వెంకటేశ్వర స్వామి ఆలయం, భీమేశ్వరాలయం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాల్లో నూతనంగా ఏర్పాటు అయిన పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.పురాతన నిర్మాణాలను సంస్కృతి ప్రాధాన్యతను కాపాడుకోవాలని దేవాలయాల భూములను సంరక్షించుకోవాలని ఆయన సూచించారు..