అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం నేపథ్యంలో వడ్డే నరేష్ అనే వ్యక్తిపై వడ్డే అంజిని శ్రీనాథ్ ఆనంద్ అనే ముగ్గురు కట్టెలు రాడ్లతో దాడి చేసి గాయపరచినట్లు బాధితుడు తెలిపారు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలు ఇవ్వడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.