కామారెడ్డి జిల్లాలో నెలకొన్న సమస్యల్ని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ... గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు.. గత పది రోజులుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు.