పమిడిముక్కల మండలంలో రెవిన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లోని స్టాక్, స్టాక్ బుక్స్ ను పరిశీలించిన అధికారులు, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా కొరతపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.