జిల్లాలోని ప్రతీ ఒక్కరూ ఎయిడ్స్ పై అవగాహన చెందాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. హెచ్‌ఐవి/ఎయిడ్స్, మాదకద్రవ్య దుర్వినియోగం పట్ల యువతలో అవగాహన పెంపొందించేందుకు యూత్ ఫెస్ట్–2025 ఐఈసి మారథాన్ 5కె రెడ్ రన్ కార్యక్రమం మంగళవారం దిశ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి, జెండా ఊపి 5కె రన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఎస్.వి.డిగ్రీ కాలేజీ వద్ద ప్రారంభమైన రన్ 4 రోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది.