శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం. నార్సింపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రమేష్పై శనివారం మధ్యాహ్నం బుక్కపట్నం పోలీస్టేషన్లో కేసు నమోదు చేశారు. మండల టీడీపీ కన్వీనర్ మళ్లిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో నకిలీ వికలాంగుల ధ్రువపత్రాలు సృష్టించారని, వాటిని తొలగించడానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని తెలిపారు. రమేశ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తుండటంతో చర్యలు తీసుకోవాలని కోరారు.