యూరియా కొరతపై జెడ్పీ సమావేశంలో రచ్చ..రచ్చ యూరియా కొరతపై గురువారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం లొని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు రచ్చ చేశారు. యూరియా కొరతపై సభ్యులు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో యూరియా కొరత లేదని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ శాఖాధికారి తెలపడంతో సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి పోడియం వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు. యూరియా కొరత కళ్ల ముందు కనిపిస్తున్నా అధికారులు బూటకపు మాటలతో రైతులను మభ్య పెడుతున్నారని సభ్యులు మండిపడ్డారు.