అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం వంజరి పంచాయతీ బూసిపల్లి లో పాఠశాల భవనం లేక సమీపంలో ఉన్న కృష్ణాపురం పాఠశాలకు రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి స్థానిక గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో విద్యార్థులంతా ఒక వాగుపై చెక్క వంతెన దాటుతూ వెళుతున్న వీడియోలను స్థానికులు పాడేరు మీడియాకి చేరవేశారు. గ్రామంలో పాఠశాల భవనం లేక ప్రతినిత్యం విద్యార్థులు ఇలా కష్టతర ప్రయాణం చేస్తూ విద్యను అభ్యసిస్తున్నారని సంబంధిత శాఖల అధికారులు గ్రామంలో పాఠశాల భవనం నిర్మించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.