ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు సత్తెనపల్లి మండలం గోగులపాడు కు చెందిన కన్యాకుమారి అనే మహిళ సొసైటీ బ్యాంకులో డ్రా చేసిన నగదులో 50,000 అపహరణకు గురయ్యాయి. బ్యాంకులో ఐదు లక్షలు డ్రా చేసిన ఆమె అందులో 4.5 లక్షలు స్త్రీ నిధి సభ్యులకి పంచారు. మిగతా 50000 తన బ్యాగులు పెట్టుకొని బస్సులో తన గ్రామానికి వెళ్తూ ఉండగా శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు సమాచారం పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో స్థానిక పోలీసులు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.