గణేష్ మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పొదలకూరు ఎస్సై హనీఫ్ సూచించారు. సింగల్ విండో విధానం ద్వారా అనుమతులు తీసుకోవాలన్నారు. వినాయక చవితి సందర్భంగా డిజెలకు అశ్లీల నృత్యలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.