పల్నాడు జిల్లా,మాచర్లలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటనలో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించే క్రమంలో బుధవారం మృతుని బంధువులు పోలీసులను అడ్డుకున్నారు.తమ బిడ్డను హత్య చేసిన వారిని పోలీసులకు అరెస్ట్ చేసారని చెప్తున్నారు గాని వారు ఎవరనేది చెప్పడం లేదని,చంపిన వారి పేర్లు చెప్పి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించమని ఆందోళన చేపట్టారు.