విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ఎస్ఎఫ్ఎస్ఐ పిలుపు మేరకు భీమవరంలోని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని సోమవారం సాయంకాలం 4:30కు నిర్వహించారు. జిల్లా నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రూ.6,400ల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఎస్ఐ నాయకురాలు సింధు కోరారు. అనంతరం డీఈఓకి వినతిపత్రం అందించారు.