విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని తమన్నమెరక జగనన్న కాలనీలో భార్య భర్తలు చిరంజీవి, వెంకటలక్ష్మి లు అనుమానస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. సీఐ షణ్ముఖరావు ఘటనా స్థలిని పరిశీలించి కుటుంబ సభ్యులు స్థానికులతో మాట్లాడారు. అనంతరం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... వేపాడ మండలం కొప్పలవానిపాలెంకు చెందిన చిరంజీవికి, కొత్తవలస మండలం అప్పనదొరపాలెం పంచాయతీ జోడి మేరకు చెందిన వెంకటలక్ష్మికి ఈ ఏడాది మార్చిలో వివాహం జరిగిందన్నారు. ఇద్దరి మద్య గొడవులు ఉన్నాయన్నాయన్నారు. పోస్టుమార్టం రిపోర్టును బట్టి వీరి మృతిపై అనుమానాలు వీడుతాయని తెలిపారు.