కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్త్ సిటీ స్కూల్ ఆవరణలో బుధవారం విద్యార్థులు పార్క్ చేసిన సైకిలను ఒక వ్యక్తి దొంగిలించాడు. ఈ దొంగతనం సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయింది. గురువారం స్కూల్ యాజమాన్యం సూరారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని సిసిటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.