నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మంగళవారం సాయంత్రం టి యు డబ్ల్యూ జే ఐ జే యు జర్నలిస్ట్ యూనియన్ నాగర్ కర్నూల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ డిఎస్పి శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఆర్టీసీ డిఎం యాదయ్య సంఘం జిల్లా అధ్యక్షులు పి విజయకుమార్, పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మల్లేష్, శ్రీశైలం సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్ గుంటూరు శ్యామ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు