బ్రహ్మసముద్రం మండల ఏపీఎంగా శనివారం వీరనారప్ప బాధ్యతలు స్వీకరించారు. స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఇంచార్జ్ ఏ పీ ఎం గా పనిచేస్తున్న హుస్సేన్ బదిలీ అయ్యారు. సింగనమల మండల ఏపీఎంగా పనిచేస్తున్న వీరనారప్పను ఉన్నతాధికారులు ఇక్కడికి బదిలీ చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వీర నారప్పను సిబ్బంది అభినందించారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని వీరనారప్ప చెప్పారు.