శనివారం ఇంజనీరింగ్ కళాశాలలో స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ విసి కుమార్, పూర్వ విద్యార్థులు కృష్ణ, శ్రీనివాసులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ తో పాటు నగదు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల చారిత్రక ప్రాధాన్యతను విసి కుమార్ ప్రస్తావించారు.